రవితేజ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

57

మహారాజా రవితేజ క్రాక్ సినిమాను 2021 జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లు చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్‌ రవితేజ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇవ్వనుంది.

జనవరి 1న క్రాక్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర బృందం. రవితేజ, శ్రుతిహాసన్ హుషారుగా ఓ పాటలో డాన్స్ చేస్తూ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. రవితేజ బ్లాక్ డ్రెస్‌లో ఎప్పట్లా ఫుల్ ఎనర్జీతో కనిపిస్తుంటే, శ్రుతి అల్ట్రా మోడరన్ లుక్‌లో అలరిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ చూస్తుంటే థియేటర్లలో ఆడియెన్స్‌కు పండగే అనిపిస్తుంది.