కేరళలో నిఫా వైరస్‌ వ్యాప్తి

396

    కేరళలో నిఫా అనే వైరస్‌ కారణంగా 10 మంది మరణించారు. పెరంబ్రా తాలూకా ఆసుపత్రిలో ఈ రోగులకు సేవలందిస్తున్న ఓ నర్సు కూడా ఇదే వైరస్‌తో మృతి చెందినట్లు గుర్తించారు. ఎక్కువ మరణాలు మణప్పురంలో సంభవించాయి. మరో 25 మంది ఇవే లక్షణాలతో కోజికోడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి గురించి కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ కేంద్రానికి సమాచారమిస్తూ ఈ కొత్త వైరస్‌ గురించి అధ్యయనం చేసి, వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక వైద్యనిపుణుల బృందాన్ని పంపించాలని కోరారు. దీంతో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ కు చెందిన నిపుణులను కేరళకు పంపింది.

    నిఫా వైరస్‌ ఇంట్లో పెంచుకునే, అలాగే పరిసరాల్లోని జంతువులకు సోకి, వాటి ద్వారా మనుషులకూ వస్తోందని, అయితే ముందస్తుగా నివారణకు టీకా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరణానికి దారి తీసేంతగా తీవ్ర జ్వరాన్ని చూపించే ఈ వైరస్‌ సోకిన వారికి ఇన్‌టెన్సివ్‌ కేర్‌తో వైద్య చికిత్సలు చేయడమొక్కటే మార్గమని ఈ వెబ్‌సైట్‌ సూచిస్తోంది