డ్రైవ్ చేసేటప్పుడు కుటుంబాన్ని గుర్తుచేసుకోవడం మంచిదని ఎందుకంటారో తెలుసా….

365

      అతివేగం ప్రమాదకరం అని ఎంత మొత్తుకుంటున్నా… పెడచెవిన పెడుతున్నారు యువత. దానికి మూల్యం తప్పక చెల్లించక తప్పట్లేదు. తమ ప్రాణాలు కోల్పోవడమే కాదు తననే నమ్ముకున్న వారికి అది తీరని బాధ. అతి వేగంతో అదుపుతప్పి ఓ యువకుడు విలువైన ప్రాణాలు కోల్పోయాడు. ఆ వివరాలు చూస్తే…సిరిసిల్లలో ఈ ఘటన జరిగింది. సిరిసిల్ల జిల్లా నిజమాబాద్ గ్రామ నివాసి అయిన యువకుడు వాహనం నడుపుతూ అదుపుతప్పి బావిలో పడ్డాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరగుతూనే ఉన్నాయి. అతివేగం కారణంగానే అదుపుతప్పి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తుంటారో ఆలోచించి వాహనాన్ని నడపండి. అతివేగం వలన మీ కుటుంబం మాత్రమే కాదు ఎదుటి వారి కుటుంబం లో కూడా మీరు విషాదం నింపే అవకాశం ఉంది.