ఎదురించి ప్రేమ పెళ్లి, అమ్మ కాశీకి, ఇండస్ట్రీలో ఎవరైనా కెలికితే…. బిగ్‌బాస్ శ్యామల భర్త!

732
‘మావూరి’ వంట అనే చిన్న టీవీ కార్యక్రమంతో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ యాంకర్‌గా ఎదిగింది. తర్వాత టీవీ సీరియళ్లు, సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 2లో టాప్ కంటెస్టెంటుగా తన హవా కొనసాగిస్తోంది. శ్యామలకు చాలా కాలం క్రితమే పెళ్లయింది. నరసింహ రెడ్డి అనే టీవీ నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే శ్యామల పెళ్లి వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరసింహారెడ్డి శ్యామల జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

అలా మా పరిచయం మొదలై… ప్రేమగా

శ్యామల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఉంటున్న రూమ్ దగ్గర కొబ్బరి బొండం తాగడానికి వచ్చేది. ఆ సమయంలో ఆమెను చూశాను. తర్వాత అనుకోకుండా మాకు ఒకే సీరియల్ లో జంటగా నటించే అవకాశం వచ్చింది. అలా మొదలైన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారిందని నరసింహారెడ్డి తెలిపారు.

శ్యామల ఇంట్లో ఒప్పుకోలేదు

అయితే మా పెళ్లికి శ్యామల ఇంట్లో ఒప్పుకోలేదు. నేను వెళ్లి కన్విన్స్ చేసినా వారు వినలేదు. మా పేరెంట్స్ యూఎస్ఏలో ఉంటారు. వారిని వెంటనే పిలిపించమన్నారు. వాళ్లు ఇప్పుడు రావడం కుదరదు, ఆరునెలలు ఆగమని చెప్పాను. అప్పటి వరకు మీరిద్దరూ కలుసుకోవద్దు అని కండీషన్ పెట్టారు…. అని నరసింహారెడ్డి గుర్తు చేసుకున్నారు.

శ్యామలను వదిలేసి వెళ్లిపోయారు

ఇద్దరినీ కలవద్దని కండీషన్ పెట్టడంతో మేము ఒప్పుకోలేదు. సినిమా డైలాగులు చెప్పొద్దని చెప్పాను. శ్యామల కూడా ఈ విషయంలో స్ట్రాంగ్ గా ఉంది. దీంతో వారు శ్యామలను వదిలేసి వెళ్లిపోయారు అని నరసింహారెడ్డి తెలిపారు.

శ్యామలను తీసుకొచ్చా, సంవత్సరం తర్వాత పెళ్లి

శ్యామలను వారి ఇంట్లో వారు వదిలి వెళ్లిపోవడంతో ఆ ఇల్లు ఖాళీ చేయించి ఆమెను అక్కడి నుండి తీసుకొచ్చి మా అక్కవాళ్ల ఇంట్లో ఉంచాను. సంవత్సరం తర్వాత మా పేరెంట్స్ యూఎస్ఏ నుండి తిరిగి వచ్చిన తర్వాత మా పెళ్లి జరిగిందని నరిసంహా రెడ్డి తెలిపారు.

శ్యామల తండ్రి చిన్నపుడే పోయారు, తల్లి కాశీకి వెళ్లింది

శ్యామల తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. మా పెళ్లి తర్వాత కాకినాడలో ఉన్న వారి సొంతిల్లు అమ్మేసి శ్యామల తల్లి కాశీకి వెళ్లి పోయింది. ఆమె ఇప్పుడు అక్కడే ఉంటున్నారు అని నరిసింహారెడ్డి తెలిపారు.

శ్యామల ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు

శ్యామల ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. ఒక్కొక్క మొట్టు ఎక్కుతూ కష్టపడి వచ్చింది. మా వూరు వంటతో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. తర్వాత అవకాశాలను అంది పుచ్చుకుంటూ తన టాలెంటుతో పైకొచ్చిందని నరిసింహారెడ్డి తెలిపారు.

ఇండస్ట్రీలో ఎవరైనా కెలికితే…

శ్యామల మీద సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేసేవారంతా ఫేక్ అకౌంట్లే… వాడెవడో తెలిస్తే ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగేవాన్ని. ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్లా అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మన బిహేవియర్ బట్టే ఎవరైనా మనల్ని కెలకటం లాంటివి చేస్తారు. వారికి అలాంటి ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరూ మన జోలికి రారు. ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు శ్యామల నాకు చెబుతుంది. నేను వెళ్లి హ్యాండిల్ చేస్తాను… అని నరసింహారెడ్డి తెలిపారు.

బిగ్ బాస్ విన్నర్ అవుతుందో లేదో చెప్పలేను

బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏదైనా జరుగవచ్చు. శ్యామల విన్నర్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. తన వల్ల అయినంత వరకు ది బెస్ట్ గేమ్ ఆడటానికి శ్యామల ప్రయత్నిస్తుంది అని నరసింహారెడ్డి తెలిపారు.