తప్పు ఓటర్లదా లేదా నాయకులదా మీరే చెప్పండి

385

వీధిలో వేసిన సిసి రోడ్డు ఆనందపడుతూ..
ఒక పెద్దాయన ఆ సిసి రోడ్డు కాంట్రాక్టర్ దగ్గరకెళ్లి..

అయ్యా కాంట్రాక్టర్ గారూ..

మా వీధిలో సిసి రోడ్డు వేశారు. చాలా సంతోషంగా ఉంది కాని మీరు వేసిన రోడ్డుకు ఒక అరమీటర్ పెంచితే ఇంతకుముందు ఉన్న రోడ్డుకు కనెక్టివ్ గా ఉంటుంది. అదే విధంగా మా ఇండ్ల ముందు బాగా ఎత్తుగా రోడ్డు ఉండి ఇంట్లోకి ద్విచక్ర వాహనాలను పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది.. కొద్దిగా అటు ఇటు పెంచితే మా వీధిలో ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పాడంట..

అప్పుడు ఆ కాంట్రాక్టర్ చూడు పెద్దాయన.. నాకు మీ ఎరియాలో ప్రజాప్రతినిధికి వచ్చిన నిధులనుండి వచ్చిన పని చేశాను..అంతవరకే వేయగలను.. అంతకంటే బొచ్చేడు ఇసుక చెంచాడు సిమెంట్ కలిపిన నాకు లాభం ఉండదు..

ఇప్పటికే అక్కడ మీ ప్రజాప్రతినిధికి.. లోకల్ పార్టీ లీడర్ కు.., నాణ్యత పరిశీలించే అధికారులకు..,ఇలా రోడ్డు కొరకు వచ్చిన నిధుల నుండే ఇచ్చాను.. కనుక ఇంతకంటే నాణ్యత, పరిమాణం పెంచటం వీలుకాదు అనడంతో నిరాశతో..

రోడ్డు పరిశీలన అధికారిని కలిసి మొర పెట్టుకోగా..

అయ్యా పెద్దాయన ఏదో పాపం ఇబ్బందులు పడుతున్నారని దయ తలిచి రోడ్డు అనుమతి ఇస్తే ఇప్పుడు ఇలా కావాలి అలా కావాలి అంటావా.. అప్పుడు ఆ పెద్దాయన…
అయ్యా కాంట్రాక్టర్ గారు మీకేదో సమర్పించుకున్నారంట కదా.. అందుకే ఇంతకంటే వీలు కాదు అన్నారు.. మీకు జీతాలు ఉండగా మళ్ళీ ఇదేంటయ్యా.. అనగా ……
ఏదో పెద్ద మనిషివి అని గౌరవిస్తుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావ్.. మాకు ఖర్చులు ఉండవా.. మీకు సేవ చెయ్యటానికే పుట్టామా అని కరుచుకున్నాడు..

అప్పుడు పెద్దాయన మీరు మనిషిగా మాకు సేవ చేయటానికి పుట్టలేదు కానీ.. ఉద్యోగిగా మాకు సేవ చేయ్యటానికి మేమే పుట్టించుకున్నాం అని వెనుదిరిగాడు..

ఆ తరువాత తమ ప్రజాప్రతినిధి దగ్గరకు వెళ్ళి వివరించాడు..

చూడు పెద్దాయన నేను కమీషన్ తీసుకున్న మాట వాస్తవమే కానీ నేను ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఎంత ఖర్చు పెట్టానో తెలుసా.. నాకు ఆ డబ్బులు ఎలా తిరిగి వస్తాయి..

అప్పుడు ఆ పెద్దమనిషి నేను మీకు ఓటు వేశా మీనుంచి ఏం ఆశించలే.. యువకుడివి మంచి చేసే లక్షణాలు ఉన్నాయి అందరిలో మీరు మంచి అనిపించి ఓటు వేశా.. ఆఖరికి మా పిల్లలను కూడా మీకు మద్దతుగా పంపించా.. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం ఏంటీ అనగా..
నిజమే పెద్దాయన నేను నా ఎరియాకి ఏదైనా మంచి చేయ్యాలనే పోటీ చేశా.. కానీ గెలవాలంటే ఎక్కడకు వెళ్లిన డబ్బులు ఎంత ఇవ్వగలవు అని అడగసాగారు.. మీరు నా వద్ద ఏం ఆశించలే వాస్తవమే.. కానీ మీ వీధిలో ఇంటింటికి డబ్బులు పంచా..
ఇంకో విషయం ఏంటంటే.. మీ ఇంట్లో కూడా మీ ఓట్లు లెక్కపెట్టి డబ్బులు ఇచ్చి వచ్చా.. అప్పుడు పెద్దమ్మ.. కొడకా పెద్దనాన్నకు చెప్పకురా.. చెబితే కోప్పడతాడు అన్నారు.. ఇక మీ పెద్దోడు రోజు వాళ్ళ స్నేహితులతో నాతో తిరిగాడు.. దానికి మీకు చెప్పలేని ఖర్చు పెట్టాను అని అనగా..
పెద్దాయన బాధగా చూస్తుంటే.. పెద్దాయన బాధ పడకు ఎంత గొప్ప ఉన్నత ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చాక అయ్యే ఖర్చు వల్ల అవినీతిపరుడవుతున్నాడు..

అది విని ఇంటికి వచ్చిన పెద్దాయనతో కుటుంబసభ్యులు.. ఏంటండి బాధగా ఉన్నారు అనగా _సమాజంలో మార్పు రావాలి మార్పు రావాలి అని అనుకునేవాన్ని కానీ కాదు నా కుటుంబంలోనే మార్పు రావాలి అని అర్థం అయింది ఇన్ని ఏళ్లకు..

దయచేసి రాబోవు ఎన్నికలలో డబ్బుకు లోంగి,,, సిసాకి బానిసై మీ ఓటును అమ్ముకొకండి..

ఏ నీకు డబ్బు సంపాదించే శక్తి లేదా. ……???
వాళ్ళు ఆ సమయంలో ఇచ్చిన డబ్బుతోనే జీవితాంతం నువ్వు నీ కుటుంబాన్నీ పోషించగలవా. …….???

ఒక్కటి గుర్తుకు పెట్టుకో ……

వాళ్ళు ఇచ్చే డబ్బు నీకు అవసరాల నిమిత్తం ఒక్క రోజు కూడా సరిపోదు …… అదే నువ్వు వేసే ఓటుతో అతను 5సం…రాలు కుర్చీలో కూర్చొని అడ్డదిడ్డంగా సంపాదించుకోగలడు. …….
దయచేసి అందరికీ షేర్ చేయండి ..