విమానం లో కూలిపోయే ముందు అరుపులు కేకలు కన్నీళ్ళు పెట్టించే వీడియో

219

         నిశబ్దం ఎంతో భయంకరంగా ఉంటుంది. మరి కొద్ది క్షణాల్లో చనిపోతామని తెలిస్తే మనకు ఎలా ఉంటుంది. అనారోగ్యంతో చనిపోతే వేరే విషయం ప్రమాదంలో గాయపడి ఇక బ్రతకలేమని తెలిసినా బాధపడడం మినహా ఏమి చెయ్యలేము. ఎందుకంటే ఆ సమయంలో కూడ నొప్పి ఉంటుంది. కాని ఇండోనేషియా ఎయిర్ లైన్ ప్రమాదం గురించి కొత్త వీడియోలు బయటకు వచ్చాయి. ఆధునాత మొబైల్ కావడంతో అందులో ఉన్న వీడియోలు చెక్కు చెదరలేదు. ఆ ఫోన్ లో ఏమైనా కారణాలు దొరుకుతాయేమోనని సాంకేతిక పరిజ్ఞానలతో వాటి లాక్ తీసి వీడియోలను తీసారు. భద్రంగా మల్లి వాటిని వారి వారి బందువులకు అప్పగించారు. కాని ఒక వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. సాంకేతిక సమస్య వలెనే విమానం కులిపోయిందని భావిస్తూ ఉన్నారు. పైలెట్ మన భారతీయుడే. కో పైలెట్ కూడా అనుభవం ఉన్న వ్యక్తే.. జకర్తా విమానాశ్రయం నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలెట్ గుర్తించినట్టు తెలుస్తుంది. 2000 అడుగుల నుంచి విమానం ఒకేసారి 500 అడుగులకు జారిపోయిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీం గుర్తించింది. ఎం జరిగిందో కాంటాక్ట్ అయ్యేలోపే మళ్ళి వేల అడుగులకు చేరింది. దీంతో కంగారు పడ్డ విమానాశ్రయ సిబ్బంది వారిని అప్రమత్తం చేద్దామని ప్రయత్నించే లోపే తిరిగి జకార్తా విమానాశ్రయం కి వస్తున్నాం లాండింగ్ కు అనుమతి కావాలి అని కోరాడు పైలట్.

కాని ఈలోపే జావా సముద్రంలో కూలిపోయింది విమానం. విమానం దూరంగా సముద్రంలో కూలడాన్ని దూరంగా షిప్ లో వెళుతున్న కొంతమంది ప్రత్యక్షంగా చూసారు. అయితే విమానంలో ఉన్న ఎవరు కుడా బ్రతకలేదు. మొత్తం 189 మంది, మన భారత పైలెట్ అయిన భవ్య సునేజ కుడా చనిపోయాడు. అయితే మొదటిసారి 500 అడుగులకు జారిపోయినప్పుడే ప్రయాణికులకు పరిస్తితి అర్ధమైంది. పైలెట్ ధైర్యం చెప్పినా కుడా వాళ్ళంతా రోదించిన వీడియో బయట పడింది. ఒకేసారి అంతమందికి చనిపోతామని తెలిసినపుడు ఎం చేసారో తెలిస్తే గుండెలు అవిసిపోతాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వీళ్ళందరి మృత్యువు ఒక్కచోటే అని తెలిసిన వీళ్ళందరూ ఒక్కసారిగా ఏడ్చారు. దేవుడ్ని ప్రార్దించారు. కొంతమంది అల్లా హో అక్బర్ అంటే మరికొంతమంది జీసస్ ను ప్రార్ధించారు. ఇలా ఎవరి దేవుళ్ళను వాళ్ళు అరుస్తూ రోదిస్తూ కాపాడమని వేడుకున్నారు. గాలిలోనే ఉన్న ఏ దేవుడు వారి రోదనలు వినలేదు. ఆడవాళ్ళూ ఏడుస్తూ పిల్లలను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొన్ని వీడియోలు బయటకు వచ్చినా కుడా ఇది ఒక్కటే లీక్ అయ్యింది. ఆ వీడియోలు చుస్తే తిండి కూడా తినబుద్దికవడం లేదని ఒక ఇండోనేషేయ అధికారి కన్నీటి పర్యంతమయ్యారు. విమానం శేకవుతుంటే వారికి చనిపోతామని అర్ధమైనట్టుంది. వారికి ఇష్టమైన దేవుడిని ప్రర్దించుకున్నారు. ప్రేమించే వ్యక్తులను గుర్తుచేసుకున్నారు.