భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఉరి వేసుకొని…

139

       సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రశాంత్ కేసులో కొత్త కోణాలు బయట పడుతున్నాయి. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటు భర్త ప్రశాంత్ సూసైడ్ చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. పావని మాత్రం భర్త , అత్తమామలు చేసిన వ్యాక్యలు అబద్దాలని కొట్టిపారేస్తుంది. అయితే పోలీసులకు దొరికిన టేప్ ఒకటి ఈ కేసులో కీలకం గా మారింది. ప్రశాంత్ , పావని ల సంభాషణలును పోలీసులు సంపాదించారు. ప్రియుడు ప్రణయ్ ను వదిలెయ్యాలని ప్రశాంత్ బ్రతిమిలడుతుంటే వదిలే సమస్యే లేదంటూ ఆమె తెగేసి చెప్పింది. నీ ప్రవర్తన ఇలానే ఉంటె చచ్చిపోతానని బెదిరించిన పావని డోంట్ కేర్ అంటూ పావని చెప్పినట్లు ఆడియో లో స్పష్టంగా ఉంది.

       భర్తను వదులుకోవడానికి సిద్దపడ్డ పావని ప్రియుడు ప్రణయ్ ను పల్లెత్తు మాటన్నా భర్త ప్రశాంత్ పై సీరియస్ అయ్యింది. మనమిద్దరం సంతోషంగా ఉందామని ఎంత ప్రదేయపడ్డా పావని మాత్రం పట్టించుకోలేదు. పైగా చస్తే చావు అని చెప్పడంతో భర్త స్తానంలో ఉన్న ప్రశాంత్ అసలు జీర్ని౦చుకోలేకపోయాడు.  ప్రియుడి మోజులో పడి భర్త చావుకు కారణమైన పావని ని పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రశాంత్ సూసైడ్ నోట్ , ఆడియో టేప్ ల ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ ఆడియో టేప్ లను డైయింగ్ డిక్లరేషన్ గా తీసుకున్నారు పోలీసులు.