‘సర్కార్’ పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

187

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు తమిళ రాకర్స్ వెబ్ సైట్ ‘సర్కార్’ HD ప్రింట్ ఆన్ లైన్ పెడతామని బెదిరించారు.

తమిళ ఇండస్ట్రీలో పైరసీ వెబ్ సైట్స్ ని చాలా వరకు కంట్రోల్ చేసినా.. తమిళ రాకర్స్ ఆగడాలను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు వారు బెదిరించినట్లుగానే ‘సర్కార్’ సినిమాని ఆన్ లైన్ లో పెట్టేశారు. తమిళ రాకర్స్ బెదిరించినప్పుడే వారిపై దర్శకనిర్మాతలు ఫిల్మ్ బాడీ, అలానే పోలీసులకు కంప్లైంట్ చేశారు.

కానీ తమిళ రాకర్స్ మాత్రం ఈ సినిమాను విడిచిపెట్టలేదు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చేసింది. అయితే ఇంతగా పైరసీకి పాల్పడడం వెనుక ఇండస్ట్రీలో కొంతమంది వారికి సహాయం చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ పైరసీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!