కర్నూల్ నగరంలో తుంగభద్ర నది ఒడ్డున వ్యక్తిని చంపి గుండెని తీసుకెళ్లిన దుండగులు

156

     కర్నూల్‌లో తుంగబద్ర నదిఒడ్డున ఒక హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని అతి కిరాతకంగా హతమార్చారు. అప్పటికీ కసి తీరక..అతడి గుండెను చీల్చి పట్టుకెళ్లిపోయారు. పట్టణంలోని తుంగభద్ర నది తీరంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కర్నూల్‌కు చెందిన రౌడీషీటర్ చెన్నయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని హంతకుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

    సాయిబాబా సంజీవ్‌నగర్ ప్రాంతంలో చెన్నయ్య నివసిస్తున్నాడు. ఐతే బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన చెన్నయ్య తిరిగి రాలేదు. గురువారం తెల్లవారుజామున తుంగభద్ర నది తీరంలో స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ డెడ్‌బాడీ చెన్నయ్యదేనని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా,ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.