యజమానితో పారిపోయిన మహిళ మృతి

108

      అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ యాదయ్య కథనం ప్రకారం… సూర్యపేట జిల్లా, తిరుమలగిరి మండలం, బాతు వెంకన్న తండా చింతల పాలెంకు చెందిన కె.రాంజీ కూతురు జ్యోతి ను.. నాయక్ తండాకు చెందిన స్వామికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. సంవత్సరం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి షేక్‌పేటలోని దర్గా వద్ద నివాసం ఉంటున్నారు. స్వామి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, జ్యోతి హోటల్‌లో పనిచేస్తుంది.

      కొన్ని రోజుల క్రితం జ్యోతి అదృశ్యం అయిన్నట్లు ఆమె భర్త షేక్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భార్య ఆచూకీ తెలియక పోవడంతో స్వామి.. కొడుకును తీసుకొని ఊరికి వెళ్లిపోయాడు. అయితే ఇటీవల హోటల్ యజమాని శేషు , జ్యోతి ఇద్దరు లెనిన్‌నగర్‌కు మకాం మార్చారు. అయితే జ్యోతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం కింద పడి ఉండటంతో పలు అనుమానాలు ఉన్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.