అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసింది ఎవరు.. విచారణలో సంచలన విషయాలు!

129
     కమల్ హాసన్ రెండోవ కుమార్తె అక్షర ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన ఘటన దుమారం రేపిన సంగతి అందరికి తెలిసిందే. అక్షర హాసన్ తన రూంలో ప్రైవేట్ దుస్తుల్లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే కమల్ కుటుంబ సభ్యులు కానీ, అక్షర కానీ స్పందించలేదు. కొన్ని రోజులు తరువాత అక్షర హాసన్ ముంబై పోలీసులని కలసి ఫిర్యాదు చేసింది. ఆ తరువాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెడుతూ ఫోటోల లీక్ గురించి మాట్లాడింది. ప్రస్తుతం పోలిసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
https://i.imgur.com/uyLvnel.png?1

    తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసిన వారిని తప్పకుండా బయటకు లాగుతా అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం అక్షర హాసన్ తెలిపింది. తనని మానసికంగా వేధించినవారిని వదిలిపెట్టేది లేదుఅంటూ పేర్కొంది. అందుకు తగ్గట్లుగానే ముంబై పోలీసులు ఈ కేసులో వేగంగా విచారణ జరుపుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు మొదట అక్షర హాసన్ ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అక్షర హాసన్ ఫోటో షూట్ సందర్భంగా తీసినవి అని చెబుతున్నా నమ్మశక్యంగా లేదని పోలీసులుఅంటున్నారు. అక్షర హాసన్ అందించిన వివరాల ప్రకారం ఆమె 2013 లో ఏఈ ఫోటోలు దిగిందట. ఆసమయంలో అక్షర వాడుతున్న ఐఫోన్ 6 లో ఈ ఫోటోలు ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత ఆ ఫోన్ నీటిలో పడిపోయి పోయిందని అంటోంది.

నటుడిగా రాణిస్తూ

     పోలీసులు విచారణలో భాగంగా ప్రముఖ నటి రతి అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్వాణి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కమల్ హాసన్ బాలీవుడ్ డెబ్యూ మూవీలో రతి అగ్నిహోత్రి హీరోయిన్ గా నటించింది. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. ఆ కోణంలో విచారణ జరిపినప్పుడు అక్షర హాసన్, తనూజ్ కొంతకాలం రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

      తనూజ్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో హీరోగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఈ కేసులో పోలీసులు ప్రాధమికంగా తనూజ్ ని విచారించినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రశ్నలకు బదులిస్తూ.. అక్షర హాసన్ ఫోటోలు లీక్ కావడం బాధాకరం. కానీ ఆలాంటి ఫొటోలేవీ తనవద్ద లేవని తనూజ్ చెబుతున్నాడు. అక్షర తనూజ్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో ఈ ఫోటోలు అతడికి షేర్ చేసి ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇంకా దర్యాప్తు చేయాలని పోలీసులు చెబుతున్నారు.