అప్పట్లో రజనీకాంత్ నన్ను లిఫ్ట్ అడిగేవాడు .. ఇప్పుడు ఆయన కుబేరుడు: నటుడు హేమసుందర్

334

      ఒకానొకప్పుడు తెలుగుతెరపై తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నటుడు హేమసుందర్ మన అందరికి సుపరిచితుడే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రజనీకాంత్ తో తనకి గల బంధాన్ని గురించి చెప్పుకొచ్చారు. రజనీకాంత్ హీరోగా ఎదగడానికి ముందు నుంచే నాకు తెలుసు. ఆయనతో నాకు చాలా సాన్నిహిత్యం వుంది. అప్పట్లో నాకు స్కూటర్ ఉండేది .. ఆ స్కూటర్ పై నేను వెళుతుంటే నన్ను లిఫ్ట్ అడిగేవాడు. ‘నీకు ట్రబుల్ ఇస్తున్నాను’ అనేవాడు.

      అప్పుడు ‘నేనేమైనా భుజాల మీద మోసుకెళుతున్నానా .. కూర్చో’ అనేవాడిని. అలా నన్ను లిఫ్ట్ అడిగిన రజనీకాంత్ రాకెట్ వేగంతో దూసుకుపోయాడు. తనకి ఎంత ఆస్తి ఉందనే విషయం తనకే తెలియనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆయన కుబేరుడిగా మారిపోయినా .. గర్వాన్ని మాత్రం దగ్గరికి రానీయలేదు. లైట్ బాయ్ భుజాన చేయివేసి ‘ఎలా వున్నావురా’ అని ఆప్యాయంగా అడగడం ఆయనకే చెల్లింది. రజనీకి జీవితంలో నటించడం తెలియదు. అందుకే ఇంతమంది మనసులో ఆయనకి ఇంతటి స్థానం లభించింది” అని చెప్పుకొచ్చారు.