అక్షర ఫోటోల విషయంలో నోరు విప్పిన తనూజ్

207
      ‘‘అక్షరహాసన్‌, నేను రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట నిజమే, 2013 నుంచి 2017 వరకూ… ఈ నాలుగేళ్లు ఆమెతో డేటింగ్‌ చేశాను. అప్పట్లో మేమిద్దరం ఒకరికొకరు చాలా ఫొటోలు పంపుకున్నాం. ఇటీవల లీకైన ఫొటోలూ అక్షర నాకు పంపిన ఫొటోల్లో ఉన్నాయి. కాని నాదగ్గరున్నవాటిని 2013 లోనే డిలీట్‌ చేశాను’’ అని హిందీ నటుడు తనూజ్‌ విర్వాణీ అన్నారు. ఈయన ప్రముఖ నటి రతి అగ్నిహోత్రి తనయుడు. కమల్‌హాసన్‌ కుమార్తె, నటి అక్షరా హాసన్‌ ప్రైవేట్‌ హాట్‌ ఫొటోలు ఇటీవల లీకైన సంగతి తెలిసిందే. ఇంటర్‌నెట్‌, సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలు చక్కర్లు కొట్టాయి.
https://i.imgur.com/uyLvnel.png?1
      దీనిపై స్పందిస్తూ అక్షరహాసన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీక్ చేసినవారెవరో కనిపెట్టాలని ఆమె కోరారు. క్లోజ్‌ ఫ్రెండ్‌కి మాత్రమే ఫొటోలు పంపానని ఆమె పోలీసులకు తెలపడంతో ఎక్కువశాతం తనూజ్‌ని అనుమానించారు. పోలీసులూ అదే కోణంలో విచారణ చేపట్టారని వార్తలు వచ్చాయి. వీటిపై తనూజ్‌ విర్వాణీ స్పందించారు. ముంబయ్‌లో ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆయన ఫొటోలు లీక్‌ కావడం వెనుక తన హస్తం లేదన్నారు. ఇంకా… ‘‘నేను ఓ షూటింగ్‌లో ఉండగా ఎవరో ఫోన్‌ చేసి ఫొటోల గురించి నన్ను అడిగారు. ఏం చెప్పాలో తెలియలేదు. నేను 2013లోనే ఆ ఫొటోలు డిలీట్‌ చేశా. మళ్లీ నా పేరు వార్తల్లో రావడంతో అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది. నేను ఆ ఫొటోలను మరొకరికి పంపడం గానీ, ఈ-మెయిల్‌లో సేవ్‌ చేసుకోవడం గానీ చేయలేదు.
https://i.imgur.com/nnfYiVD.jpg
       ఆ ఫ్రెండ్‌ నేనే! నన్ను ఉద్దేశించే ఆమె అలా చెప్పింది. ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయడమే మంచిదనీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళుతున్నానని అక్షర నాతో చెప్పింది. బ్రేకప్‌ అయిన తర్వాత మా స్నేహంలో ఎలాంటి మార్పు లేదు. మా వ్యక్తిగత విషయం కనుక ఎందుకు బ్రేకప్‌ అయ్యామో చెప్పలేను.  కానీ, తనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమెకు తెలుసు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి ఎవరు ఈ పని చేశారో కనిపెడతారని ఆశిస్తున్నా. పోలీసులు నన్ను సంప్రతించలేదు కనుక… నేను వాళ్ల దగ్గరకు వెళ్లలేదు. ఒకవేళ వారు వస్తే కోపరేట్‌ చేస్తా. నేనే ఫొటోలు లీక్‌ చేసి ఉంటే… అక్షరా హాసన్‌ నా పేరు చెప్పేది. లేదంటే నాపై ఆరోపణలు చేసేది. కానీ, తను అలా చేయలేదు’’ అని అన్నారు.