వరంగల్ జిల్లాలో ఘోరం.. బావ కొడుకుపై మరదలు ఘాతుకం

204
       తమ కుటుంబంలోని లేని వారసుడు తన భర్త అన్న (బావ) కుటుంబంలో కూడా ఉండకూడదనే అసూయతో బావ కొడుకుపై విష ప్రయోగం చేసింది ఓ ప్రబుద్ధురాలు. పది నెలల బాలుడిని పొట్టనబెట్టుకుంది. ఎస్సై లక్ష్మణ్‌రావు వివరాల ప్రకారం మండలంలోని సన్నూరు శివారు రాజ్‌నాయక్‌ తండాకు చెందిన బానోతు సుజాత, రెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు. కాగా రెడ్డి తమ్ముడి భార్య రజిత తమకు వారసులు లేరని, తన బావ కుటుంబంలో వారసులు ఉండకూడదనే అక్కసుతో దారుణానికి ఒడిగట్టింది.
    దీపావళి రోజు విషం కలిపిన పాలను రెడ్డి కుమారుడికి తాగించింది. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా హైదరబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.