తప్పుడు రివ్యూ ఇచ్చిన కమల్ ఖాన్! ఫుల్ గా అడేసుకున్న నెటిజన్స్

141

    అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన 2.O చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నది. ఓ వైపు సినిమాలోని టెక్నాలజీ అంశాలపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్‌కే 2.O చిత్రంపై దుమ్మెత్తి పోశాడు. అక్షయ్ కుమార్‌పై తీవ్రమైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించాడు. 2.O చిత్రంపై కేఆర్‌కే ఏమన్నాడంటే..  అక్షయ్ కుమార్ బీ గ్రేడ్ యాక్టర్ అని ట్విట్టర్‌లో కమల్ ఆర్ ఖాన్ దుమ్మెత్తిపోశాడు. యువ హీరోలు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ సింగ్ లాంటి వాళ్లు 30 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుంటే.. సూపర్‌స్టార్ అయిన అక్షయ్ ఓపెనింగ్ కలెక్షన్లు 20 కోట్ల అని ప్రశ్నించాడు.

    2.O చిత్రం రూ.600 కోట్లతో రూపొందించారు. అందులో రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ ఉన్నాడు. అయినా హిందీలో అక్షయ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లలేకపోయాడు. దానిని బట్టి ఆయన సూపర్‌స్టార్ కాదు. బీ గ్రేడ్ యాక్టర్ అని కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు.

కమల్ ఖాన్‌ను ఆడేసుకొన్న నెటిజన్లు

     అక్షయ్ కుమార్‌పై విమర్శలు చేసిన కమల్ ఖాన్‌ను నెటిజన్లు ట్రోల్స్‌తో ఆడుకొన్నారు. కలెక్షన్లపై అవగాహన లేకుండా తప్పుడు సమాచారం ఇస్తావా? రఫ్ ఆడించారు. పబ్లిసిటీ కోసం తప్పుడు లెక్కలు చెప్పకు అని గట్టిగా మందలించారు.