2.0 మరో విధ్వంసం: దంగల్ 2వేల కోట్లు, బాహుబలి 1800 కోట్ల రికార్డ్ ఉఫ్…?

138
     రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర ధారులుగా శంకర్ రూపొందించిన మెగా విజువల్ వండర్ 2.0 ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ 400 కోట్లు రాబట్టి మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా 10 వేల స్క్రీన్లలో సాధించిన వసూళ్లే. అయితే దేశీయ, ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద 2.0 బాహుబలి రికార్డులను అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ రజనీ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. చైనాలో ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించింది.

చైనాలో ఎన్ని స్క్రీన్లలో రిలీజవుతుందో తెలిస్తే షాకే…

   చైనాలో 2.0 చిత్రాన్ని దాదాపు 56 వేల స్క్రీన్లలో విడుదల చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇందులో 47 వేలు 3డి స్క్రీన్లేనంట. ఇంత భారీ ఎత్తున ఒక ఇండియన్ మూవీ విడుదలవ్వడం ఇదే తొలిసారి.