‘ఆర్‌ఎక్స్‌ 100’ డైరెక్టర్‌ ఇంట విషాదం

118
    ప్రముఖ సినీ క్రియేటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌భూపతి తండ్రి వేగేశ్న రామరాజు(54) బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి కుమారుడు అజయ్‌భూపతి ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని నిర్మించి సక్సెస్‌ డైరెక్టర్‌గా నిలిచారు. రామరాజు కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. అజయ్‌ భూపతిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. 11 రోజుల పాటు ఆత్రేయపురం స్వగ్రామంలో నిత్య కర్మల్లో అజయ్‌ భూపతి పాల్గొంటారు.