గుండెపోటు బారినపడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మీకు తెలుసా

1403

           ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.

      గుండె జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. నిజానికి గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందని అంటున్నారు వైద్యులు.

 • ఉదయాన్నే వాకింగ్ వెళ్లాలంటే చాలా బద్దకం. నిజానికి నడక గుండెకు మంచిది. అందుకే రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి.
 • డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
 • రోజూ ఐదు రకాల పండ్లు తినండి.
 • ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి.
 • గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది.
 • పొగతాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది.
 • కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
 • లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి.
 • బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి.
 • ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.
 • డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న వారికి(ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.