పూరితో వివాదం.. స్పందించిన వర్మ

121

     సంచలన దర్శకుడు వర్మ, ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్‌ల స్నేహం గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి తరుచూ పార్టీల్లో దర్శనమిస్తుంటారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి, పవన్‌ కల్యాణ్ ల విషయంలో వర్మది తప్పే అని పూరి చెప్పటం వివాదానికి కారణమని కొంతమంది ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ వార్తా పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై స్పందించిన రామ్‌ గోపాల్ వర్మ అలాంటి దేమి లేదం‍టూ క్లారిటీ ఇచ్చాడు. పూరి, నేను గతంలో ఎంత క్లోజ్‌ గా ఉన్నామో ఇప్పటికీ అలాగే ఉన్నామని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ నిర్మాణంలో తెరకెక్కిన భైరవగీత డిసెంబర్ 14న రిలీజ్ అవుతుండగా వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రీకరణ జరుగుతోంది.