
వర్షపు నీటితో నిండి ఉన్న రోడ్డుపై ఓ యువకుడు బైక్ స్టంట్ (Bike Stunt) చేసేందుకు ప్రయాణించాడు. బైక్ పై ఎక్కి రయ్యిమని దూసుకుపోవాలని అనుకున్నాడు. ఇదే సమయంలో యువకుడి స్టంట్ చూసేందుకు చుట్టుపక్కలవారు అక్కడి చేరుకున్నారు. తమ మొబైల్స్ బయటకు తీసి ఆ దృశ్యాలను తమ ఫోన్ లో బంధించేందుకు సిద్ధమయ్యారు. అందరు రావడంతో బైక్ ఎక్కి స్టంట్ ప్రారంభించాడు.. బైక్ కొద్దీ దూరం వెళ్ళగానే స్పీడ్ పెంచి ముందు ట్రైర్ లేపాడు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ముందు టైర్ అమాంతం పైకి లేవడంతో యువకుడు పట్టుకోల్పోయి బైక్ మీది నుంచి కిందకు దిగాడు. ఈ సమయంలో అతడు హ్యాండిల్ పట్టుకొనే ఉన్నాడు. వేగంగా వెళ్లిన బైక్ ప్రహరీ గోడకు తగిలింది. ఈ ప్రమాదంలో గోడ ధ్వంసం కాగా, బండి స్వల్పంగా దెబ్బతింది.
ఇక బైక్ నడిపిన యువకుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తమకు తోచినట్లు స్పందిస్తున్నారు. ‘వావ్.. ఏమన్న స్టంటా అని కొందరు అంటే..’ఇలాంటి ప్రమాదకర స్టంట్లు అవసరమా..’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియరాలేదు.
Bike Stunt
View this post on Instagram