చనిపోయే కొద్ది నిమిషాల ముందు షేర్ చేసిన లేడీ డాక్టర్ ఫొటో వైరల్..!

Kinnaur Collapses

జైపూర్ కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప ట్విట్టర్ లో చివరగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే అదే ఆమె చివరి పోస్టు కాబట్టి. హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడ్డ కొండచరియలకు ఆమె బలైపోయింది.

హిమాచల్ ప్రదేశ్ కన్నౌవ్ జిల్లాలో సంగాల్ లోయలో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఆ 9 మందిలో దీప కూడా ఒకరు.. మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా-టిబెట్ బార్డర్ వద్ద దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేసింది.

1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరీ వద్ద సంగ్లా-చిట్కుల్ రోడ్డు మీద వెళ్తున్న కార్లపై పడ్డాయి. ఓ కారులో ఉన్న దీప మరణించింది. ప్రస్తుతం ఆమె చవరి పోస్టు వైరల్ గా మారింది.