కర్ణాటక లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి ..

53

క‌ర్ణాట‌క రాష్ట్రంలో దావ‌ణ‌గెరెకు చెందిన ఒక లేడీస్ క్ల‌బ్ స‌భ్యులు సుమారు 17 మంది క‌లిసి గోవాలో స‌ర‌దాగా గ‌డుపుతామ‌ని శుక్ర‌వారం తెల్ల‌వారుజామున టెంపో ట్రావెల‌ర్‌లో ప్ర‌యాణ‌మ‌య్యారు. ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యానికి వారు ప్ర‌యాణిస్తోన్న వ్యాన్ ఇట‌గ‌ట్టి వ‌ద్ద వెళుతుండ‌గా ఎదురుగా వ‌స్తున్న ఇసుక టిప్ప‌ర్ బ‌లంగా ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో వేన్ నుజ్జు నుజ్జు అవ్వడంతో 8 మంది చ‌నిపోయారు. అందులో మ‌హిళ‌ల‌తో పాటు డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ ఉన్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న లో చెల్లా చెదురుగా ప‌డిన మృత‌దేహాల‌తో ఎటు చూసినా ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో ఆ ప్రాంత‌మంతా భీతావ‌హంగా మారింది. కొన్ని మృత‌దేహాలు వ్యాన్‌లో ఇరుక్కుపోవ‌డంతో అతికష్టం మీద మ‌ధ్యాహ్నానికి బ‌య‌ట‌కు తీశారు.

https://i.imgur.com/5lQQ6kM.jpg

క్షతగాత్రులను వైద్యం నిమిత్తం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స పొందుతూ మరో 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని తమ ప్రాధమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా త‌న సంతాపం వ్య‌క్తం చేశారు.