కొండరాళ్ళు కారుపై పడి నుజ్జు నుజ్జు.. ప్రాణాలతోబయటపడ్డ ఇద్దరు..

154
Kinnaur Landslide

Kinnaur Landslide : హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొండ చరియలు విరిగిపడటంతో ఓ బ్రిడ్జికూడా కూలిపోయింది. ఇదే ఘటనలో రాజస్ధాన్ కు చెందిన వైద్యురాలు దీపాశర్మ దుర్ఘటన జరగటానికి 25 నిమిషాల ముందు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరలైంది. అయితే తాజాగా ఘటన నుండి గాయాలతో బయటపడ్డ బాధితుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది.

kinnaur landslide

నవీన్, శిరిల్ అనే ఇద్దరు వ్యక్తులు తలకు గాయాలతో వీడియోలో కనిపిస్తున్నారు. వారిలో ఒకరు చెప్పిన సమాచారం బట్టి ఘటన జరగటానికి 10 నిమిషాల ముందు ఘాట్ రోడ్డులో కారు నిలిపి ఉంచామనిte, కొండ పైభాగం నుండి బండరాళ్ళు ఒక్కసారిగా దూసుకురావటంతో తమ కారు నుజ్జునుజ్జు అయిందని తెలిపాడు. ఎలాగొలా తాను ప్రాణాలతో కారునుండి బయటపడ్డానని…కొద్ది సేపటి తరువాత పెద్ద మొత్తంలో దుమ్ముదూళి, రాళ్ళు పడిపోవటంతో కారు ఆనవాలే కనిపించకుండా పోయింది.

సమీపంలోని ఓచెట్టుకిందకు పరిగెత్తాను అదే సమయంలో పోలీసులకు విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేసినప్పటికీ సిగ్నల్స్ లేకపోవటం వల్ల అది కుదరలేదు. తలకు గాయమై రక్తం కారుతుంటే దాని చేతి రుమాలు కట్టుకున్నాడు. అతని పక్కనే ఓ మహిళ మృతదేహం కూడా పడివుంది. రక్తంతో తడవటంతో చేతి రుకాలు అంతా ఎర్రని వర్ణంలో మారిపోయింది. విరిగిపడ్డ కొండచరియల దృశ్యాలు చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నాయి. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Kinnaur Landslide