నెట్ ఫ్లేక్స్ కి కౌంటర్ వేయబోయి ట్రోలింగ్ లో పడ్డ ఆహా..

56

‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులో ‘పిట్ట కథలు’ అనే పేరుతో ఫిబ్రవరి 19న స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతోంది నెట్ ఫ్లిక్స్. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. రెండు రోజులుగా తెలుగులో ట్వీట్లు వేస్తూ తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

‘నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ మీ ముందు’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఇది ‘ఆహా’ టీమ్ కి నచ్చినట్లుగా లేదు. నెట్ ఫ్లిక్స్ కి కౌంటర్ ఇస్తూ.. ‘మా దగ్గర చాలా ఒరిజినల్స్ ఉన్నాయి.. అరుస్తున్నామా..?’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ‘ఆహా’ ఇచ్చిన కౌంటర్ కి నెటిజన్లు రివర్స్ లో పంచ్ లు వేస్తున్నారు.

‘ఒరిజినల్ కంటెంటా..? అన్నీ డబ్బింగ్ సినిమాలే కదా’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘నెట్ ఫ్లిక్స్ తెలుగులో సిరీస్ చేస్తుంటే.. మీ బాధ ఏంటో..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రకరకాల ఫన్నీ మీమ్స్ ని షేర్ చేస్తూ ‘ఆహా’ని ఆడేసుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ కి కౌంటర్ ఇద్దామనుకున్న ‘ఆహా’ ఇప్పుడు ట్రోలింగ్ బారిన పడక తప్పలేదు.