అమెజాన్ ప్రైమ్ లో విజయ్ ‘మాస్టర్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

50

ఇళయ దళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. మాళవిక మోహనన్, ఆండ్రియా జర్మియా హీరోయిన్లుగా నటించిన ఈ సినమకు అనిరుధ్‌ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన ప్రతీ సెంటర్‌లోనూ హౌస్‌ఫుల్ బోర్డుతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ‘మాస్టర్’ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ మూవీ వచ్చే నెల 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ‘మాస్టర్’ మూవీ దాదాపు రూ.150 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.