లిక్కర్ ఆధార్ కార్డు ద్వారా మాత్రమే అమ్మాలి.. సోషల్ మీడియా లో ఫెక్ న్యూస్ చక్కెర్లు

226
ratan tata

Ratan Tata Fake News:

సోషల్ మీడియా లో ఫెక్ న్యూస్ లకు కొదవే లేదు. “*లిక్కర్ ఆధార్ కార్డు ద్వారా మాత్రమే అమ్మాలి. ఎవరైతే లిక్కర్ కొంటారో వాళ్ళకి ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సబ్సిడీలు రద్దు చేయాలి. ఎవరైతే ఆల్కహాల్ కొనుక్కోగలరో వాళ్లు భోజనం కూడా కొనుక్కోగలరు. మనం ఫుడ్ ఫ్రీగా ఇస్తుంటే వాళ్ళు మాత్రం వైన్ కొనుక్కుని మరీ తాగుతున్నారు.* *………రతన్ టాటా*” అంటూ ఒక ఫెక్ న్యూస్ వైరల్ అయింది.

ఫాక్ట్ చెక్ దానిని కొట్టి పారేసింది, మద్యం అమ్మకాలు ఆధార్ కార్డు ద్వారా జరగాలని గాని లేక మద్యం వినియోగదారులకు ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు అందకూడదని రతన్ టాటా అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ రతన్ టాటా నిజంగానే ఇలా అని ఉంటే పత్రికలు కచ్చితంగా రిపోర్ట్ చేసుండేవి.

ఐతే మద్యం అమ్మకాలను నియంత్రించడానికి, పిల్లలను మద్యం నుండి దూరంగా ఉంచడానికి, ఖాళీ సీసాల వ్యర్ధాలను తగ్గించడానికి, ఇంకా పలు కారణాల వల్ల మద్యం అమ్మకాలను ఆధార్‌తో అనుసంధించాలని కోరుతూ పలు NGOలు తమ తమ ప్రతిపాదనలు ప్రభుత్వాలకు  తెలియజేశాయి. కాని ఇవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు అని తేల్చి చెప్పింది.

ratan tata