కారును తుక్కు తుక్కు చేశారు.. కానీ డ్రైవరు తప్పించుకున్నాడు.

763

తమిళనాడు లోని మైలాడుతురై జిల్లా సిర్కాజి సమీపంలో ఒక కారు వేగంగా వచ్చి అక్కడ ఉన్నవారిని గుద్దింది. తొమ్మిది నెలల గర్భిణీతో సహా ముగ్గురు మరణించారు. మరియు ఒకరు గాయపడ్డారు. అది చూసి వొళ్ళు మండిన అక్కడి గ్రామస్థులు వాహనాన్ని రోడ్డు పై నుండి పక్కకు తోసి కారు ను నుజ్జు నుజ్జు చేశారు, కానీ డ్రైవరు మాత్రం ఘటనా స్థలం నుండి పారిపోయాడు.