పాత ఫోటోతో తాజా రైతు ఉద్యమంలో పాల్గొన్న నకిలీ సిక్కు

34

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో నకిలీ సిక్కు అని చెప్తూ, ఒక వ్యక్తి తలపాగా పెట్టుకుని నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారని ఫాక్ట్ చెక్ ఒక పోస్ట్ రిలీజ్ చేసింది.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ఒకరు 2016 లోనే ‘సిఖ్ అవేర్నెస్’ అనే వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోని ఒకరు ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు ఆ వెబ్సైటులోని ఫోటోలో చూడవొచ్చు.

ఫేస్బుక్ లో కీ-వర్డ్స్ తో వెతకగా, జనవరి 2016 లో చాలా మంది ఆ ఫోటోని ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. కాబట్టి, పోస్ట్ లోని ఫోటో తాజా రైతు ఉద్యమంకి సంబంధించింది కాదు. పాత ఫోటోని పెట్టి తాజా రైతు ఉద్యమంలో పాల్గొన్న నకిలీ సిక్కు అని తప్పుగా షేర్ చేస్తున్నారని ఫాక్ట్ చెక్ ఆరోపించింది.