రోడ్డు పై వెళుతున్న వృద్ధుడిపై హైనా దాడి.. వీడియో.

355

Hyena Attack Man

హైనా… అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన క్రూర జంతువుల్లో ఇది కూడా ఒక‌టి. బ‌తికి ఉండ‌గానే పీక్కుని తినేస్తుంది. ఆ స‌మ‌యంలో ఏ జంతువు దాని బారిన ప‌డిందో… న‌ర‌కం అనుభ‌విస్తూ దానికి ఆహారం కావాల్సిందే. అలాంటి హైనా మ‌నిషి మీద దాడి చేయ‌డం ఎప్పుడైనా చూశారా ? చాలా అరుదైన ఈ ఘ‌ట‌న ఇది. పుణేలోని ఖేడ్ అనే గ్రామంలో జ‌రిగింది.

ఓ వుద్దుడు రోడ్డుపై వెళుతుంటే పొద‌ల‌చాటున మాటు వేసిన హైనా… అమాంతంగా అత‌నిపై దాడి చేసింది. ఉన్న‌పళంగా దాడి చేయ‌డంతో ఆ వృద్దుడు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే ప‌క్క‌నే ఉన్న మ‌రో వ్య‌క్తి క‌ర్ర‌తో దాడి చేసి కొట్ట‌డంతో హైనా ప్రాణ‌భ‌యంతో ప‌రుగు తీసింది. వారి వెన‌క‌నే ఉన్న కొంత‌మంది ఈ ఘ‌ట‌న‌ను త‌మ మొబైల్ ఫోన్ల‌లో చిత్రీక‌రించి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయింది. (Hyena Attack Man)