అగ్గిపెట్టె అడిగినందుకు బీరు బాటిల్‌తో కొట్టి చంపేశాడు…

41

వరంగల్ లోని 11వ డివిజన్‌లోని ఇంద్రఖిలాబార్‌ మద్యం షాపులో అగ్గిపెట్టె గురించి మొదలైన గొడవ ఓ యువకుడి మృతికి కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చార్‌బౌళికి చెందిన ఆకెన పవన్‌కుమార్‌ అనే 22 యువకుడు తన నలుగురు మిత్రులతో కలిసి బుధవారం రాత్రి మద్యం తాగేందుకు వెళ్లాడు. సిగరెట్ కాల్చుకునేందుకు పక్క టేబుల్ లోని వ్యక్తిని అగ్గిపెట్టె అడిగాడు. దీంతో ఆ వ్యక్తి, ‘నీ వయస్సు ఎంత.? నన్నే అగ్గిపెట్టె అడుగుతావా.? అంటూ పవన్‌కుమార్‌పై దాడికి దిగాడు.

దీంతో పవన్‌కుమార్‌, మిత్రులు ఆ వ్యక్తిపై ప్రతి దాడికి దిగారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి మరింత కోపంతో బీరు బాటిల్ తో పవన్ కుమార్ తలపై కొట్టాడు. దీంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పవన్ కుమార్ ను 108 ద్వారా ఎంజీఎంకు తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.