10 రోజులు ఫ్రిజ్ లో ఉంచితీసిన మటన్ ముక్కలా అయిపోయింది కానీ

376

         ఇది ఇంగ్లాండ్ లో జరిగిన ఒక సంఘటన. ఆమె పేరు జీన్ హిల్లియర్డ్స్ అర్ధరాత్రి ఫ్రెండ్ ఇంటి నుంచి బయలుదేరి కారు లో ప్రయనించసాగింది. మంచు ఎక్కువగా కురవడం వల్ల జీన్ కు దారి సరిగా కనబడలేదు. ఇంతలో ఒక ట్రక్ అడ్డుగా రావడంతో జీన్ ట్రక్ ను తప్పించబోయి రోడ్ పక్కకు కారు ఒరిగిపోయింది. మంచు ఎక్కువగా కుదరవడం వల్ల కారు ను రోడ్ మీదకు తీసుకురాలేకపోయింది. అప్పటికే 3 కిలోమీటర్లు ప్రయాణమ చేసిన జీన్, తిరిగి వెనక్కి ప్రయాణించడం మొదలుపెట్టింది. ఆమె నడవడం మానేసి పరిగెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే వొంట్లో వేడి పెరగడానికి. కాని చలి ఎక్కువగా ఉండటం వల్ల శరీరం సహకరించలేదు. జీన్ ఎలాగోలా తిరిగి తన ఫ్రెండ్ ఇంటికి చేరుకుంది. కాని తలుపు చాల సేపు కొట్టిన ఎవరు తలుపులు తీయకపోయే సరికి జీన్ అక్కడే పడిపోయింది.

           ఉదయాన్నే జీన్ ఫ్రెండ్ బయటకు వచ్చి జీన్ ను చూసింది. మొదట గుర్తు పట్టలేదు ఎందుకంటే జీన్ చలికి ఫ్రిజ్ లో నుంచి తీసిన మాసం ముద్దలా మారిపోయింది. జీన్ చనిపోయిందని అందరు అనుకున్నారు. హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్స్ నమ్మలేని విషయం ఏంటంటే జీన్ గుండె ఇంకా కొట్టుకుంటుంది అదికూడా నిమిషానికి 8 సార్లు. వెంటనే జీన్ ను ICU కి షిఫ్ట్ చేసారు. ఇంజక్షన్ చెయ్యాలన్న కుడా ఆమె శరీరం గట్టిగ ఉంది మంచు ముద్దలా. డాక్టర్స్ కి అసలు నమ్మకం లేదు బ్రతుకుతాదని, ఒకవేళ బ్రతికినా జీవత్సవంలా బ్రతకాలి అని తేల్చి చెప్పేశారు. వరం రోజుల తరవాత జీన్ ఒకేసారి గట్టిగ అరచింది. వెంటనే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. 40 రోజుల్లో చిన్న గాయం కూడా లేకుండా జీన్ లేచి వెళ్ళిపోయింది.