హైదరాబాద్ లో సనా కార్ ఆక్షిడెంట్, హాస్పిటల్ కి తీసుకువెళ్లిన

144

                హైదరాబాద్ శివారు లో ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మృతి చెందింది. టోలీచౌకి లోని ఆల్ హస్నా కాలనీ కి చెందిన సనా గత రాత్రి బండ్లగూడ లో సన్ సిటీ లోని బంధువుల ఇంటికి భర్త అబ్తుల్ రహీం తో కలసి కార్ లో వెళ్ళింది.

     ఈ తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న ఫియట్ కారు అదుపుతప్పి డివైడర్ మీదుగా విధ్యుత్ స్తంభాన్ని డీ కొట్టి అవతలి వైపు ఉన్న రోడ్డు ఫుట్ పార్క్ పైన ఆగింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా కొన్ని గంటల్లోనే సనా మృతి చెందింది. ఆమె భర్త మృత్యువు తో పోరాడుతున్నారు. ప్రమాదంలో విద్యుత్ స్తంభం రెండు ముక్కలైంది. అంటే ప్రమాదం ఎంత తీవ్ర స్తాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. కారు కూడా నుజ్జు నుజ్జు అయింది.