ఒక్కపుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జు.ఎన్టీఆర్, నాగార్జున లతో నటించిన ఆ హీరోయిన్ ప్రస్తుత

323

       టైం బాగున్నపుడు అన్ని పరిస్తితులు బాగానే ఉంటాయి. కానీ ఏదైనా అవసరమైన పరిస్తితి వచ్చినపుడే దానికి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. ప్రస్తుతం ఒక సెలబ్రిటీ ఇలాంటి పరిస్తితుల్లోనే ఉంది. ఒకప్పుడు స్టార్ట్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది.

      ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు పంజాబీ కుటుంబం నుంచి వచ్చిన భూమికా చావ్లా. భూకికా అసలు పేరు రచనా చావ్లా, అప్పాలో జీ టీవీ లో ప్రసారమైన హిప్ హిప్ హుర్రే ప్రోగ్రాంతో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది భూమిక. హీరో సుమంత్ సరసన యువకుడు సినిమాతో టోలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన భూమిక తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం లో హీరోయిన్ గా నటించడంతో స్టార్ట్ హీరొయిన్ గా మారిపోయింది. ఆ తరవాత జునియర్ ఎన్.టి.ఆర్. తో సింహాద్రి, మహేష్ బాబు తో ఒక్కడు , వెంకటేష్ తో వాసు , మెగాస్టార్ చిరంజీవి తో జై చిరంజీవ , నాగార్జన తో స్నేహమంటే ఇదేరా … ఇలా టాలీవుడ్ లో అందరు అగ్ర హీరోలతో నటించింది ఆమె. అంతేకాదు బాలీవుడ్ లో హిందీ సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ పక్కన కూడా తేరే నాం అనే సినిమాలో నటించింది. భూమిక తెలుగు హిందీ మాత్రమే కాదు తమిళ్ , మలయాళం , కన్నడ , బొజ్ పూరి , పంజాబీ భాషలలో కూడా నటించింది. అప్పట్లో కుర్రకారు కి ఈమంటే విపరీతమైన క్రజ్. హిరోయిన్ రేమ్యునరషన్ లు కొట్లలో చేరడానికి ఒకందుకు ఈమె కారణమంటారు ఇండస్ట్రీ వర్గాలు . మిస్సామ్మ లో ఆమె నటనకు గాను నంది అవార్డు దక్కించుకుంది.

       తన కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నపుడు తన యోగ టీచర్ అయిన భారత్ ఠాకూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి కావడంతో ఆమెకు హిరోయిన్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దాంతో ఆమె డౌన్ టౌన్ ఫిలిమ్స్ అనే బేనర్ ను స్తాపించి నిర్మాత గా ఆమె భర్తతో కలిసి తకిట తకిట అనే చిత్రాన్ని నిర్మించింది. కాని ఆ సినిమా కాస్తా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో భూమిక కు ఆర్దికంగా కష్టాలు మొదలయ్యాయి. ఆ తరువాత ఆమె మాయ నగర్ అనే పేరుతో ఒక మాగజిన్ ను స్టార్ట్ చేసింది. కాని అది కూడా నిరాశే మిగల్చడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది భూమిక. ఇప్పటి వరకు ఆమె 10 కోట్ల వరకు అప్పుల్లో ఉన్నట్లు సమాచారం. రీసెంట్ గా ఆమె దుబాయ్ లో కుడా ఫిట్ నెస్ క్లాసులు నిర్వహించింది. కాని అది కూడా వర్కౌట్ కాలేదు. దాంతో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు తిరిగి సినిమాలలో వేషాల కోసం మొదలు పెట్టిన భూమిక కు అన్ని అక్క పాత్రలే లభించాయి. ఎం.ఎస్.ధోని సినిమాలో హీరో కి అక్కగా నటించగా త్వరలో నాని హీరోగా రాభోతున్న సినిమా ఎం.సి.ఎ. చిత్రంలోనూ నాని కి అక్కగా నటిస్తుంది. ఈ సినిమా తో అయిన భూమిక కి సక్సెస్ వస్తుందో లేదో చూడాలి.