కలబంద వల్ల ఉపయోగాలు ఎన్నో మీకు తెలుసా…

296

      ఒక్కో మొక్క ఒక్కో ఔషధంలా ఉపయోగపడుతుంది. కాని కలబంద ఒక రకమైన ఔషధ మొక్క అయినప్పటికీ అది చాలా రకాల ఔషధాలలో ఉపయోగిస్తారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండికూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్నివృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లైతే కనుక మీ పెరటి గార్డెన్ లో పెంచుకొనే సాధారణ మొక్కలే కాకుండా..ఔషధ మొక్కలను పెంచుకొనే మార్గాలున్నాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాంగా ముళ్ళు స్వభావం కలిగి ఉండి, జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వాహణ కూడా సులభమే..ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబటి గాలిలో ఉన్న తేమను పీల్చుకొనే జీవించే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో దీనికి పూలు పూస్తాయి.

కలబంద వల్ల ఉపయోగాలు

  • కలబంద కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు.
  • కలబంద లోషన్లు, యోగర్ట్స్‌ క్రీంలు, పానకాలు తయారు చేస్తున్నారు.
  • జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • దీని గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
  • ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకుని తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే, కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది.
  • దీనిలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉన్నది. అలోయిన్ నందు
  • తాజా కలబంద గుజ్జు కీళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది