విజయవాడలో బస్సు భీభత్సం, ముగ్గురు మృతి, అడ్డుకట్ట వేసిన లారీ డ్రైవర్

320

       రెండు వాహనాలు ఒకటి బస్సు మరొకటి లారీ. బస్సు ప్రాణం తీసింది లారీ ప్రాణం పోసింది. అది ఉదయం 6గంటల 40నిముషాల సమయం. ఆ బస్సు క్రింద మూడు ప్రాణాలు నలిగిపోయాయి. విజయవాడలో సిటీ బస్సు యమపాసంలా విచుకుపడింది. సింగ్ నగర్ వంతేన దగ్గర బస్సు టెర్రర్ ను క్రియేట్ చేసింది.

      వంబే కాలనీ నుంచి బస్ స్టాండ్ కు వెళుతున్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు  బ్రేకులు ఫెయిల్ కావడంతో జనాలమీదకు దూసుకువేల్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. మూడు బైక్లు ద్వంసం అయ్యాయి. జనం భయబ్రాంతులకు గురై పరుగులు తీసారు.

       చూస్తుండగానే జరిగిన ఈ ఘోర ప్రమాదం జనాల్ని కలిచివేసింది. చూస్తుండగానే పెను ప్రమాదం జరిగిపోయింది. ఈ ప్రమాదం మొత్తం అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యింది.

      అయితే బస్సు కు ముందున్న లారి డ్రైవర్ ఇది గమనించాడు. బస్సు జనల మీద నుంచి రావడం గమనించి బ్రేక్ ఫెయిల్ అని అర్ధం చేసుకున్నాడు. వెంటనే లోరీ ని రోడ్ కు అడ్డంగా నిలిపివేశాడు. బ్రేక్ లు గట్టిగ వేసేసాడు. ఆ బస్సు లారీని డి కొట్టి అక్కడికక్కడే ఆగిపోయేలా చేసాడు.