ఈ వాస్తవాన్ని కథలా విన్నాక కన్నీరు పెట్టనివారు ఉండరు..

378

       ఈ కథ నిజంగా జరిగిన వాస్తవం. ఒక వ్యక్తీ తనా కొత్త కారు తుడుసుకుంటు౦డగా తన 5 ఏళ్ళ కూతురు అక్కడికి వచ్చింది. చేతికి అందిన రాయి తీసుకొని ఓక పైపు గీతాలు గీసేసింది. కోపం పట్టలేని ఆ తండ్రి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి ఆ చిన్నారి పాపను కిందకి తోసేసాడు. అంతేకాకుండా ఆ చిన్నారి చేతుల మీద చితక్కోట్టేసాడు. కాసేపటి తరువాత ఆ తండ్రి తన కూతుర్ని తీసుకొని ఆసుపత్రి కి పరిగెత్తాడు. అక్కడి వైద్యులు చాల కృషి చేసారు. కాని చిన్నారి ని ఆమె తండ్రి కొట్టిన దెబ్బలకు చేతి వేళ్ళను తీసివెయ్యడం తప్ప మరో మార్గం లేదని వైద్యులు తేల్చి చెప్పేసారు. శాస్త్ర చికిత్స పూర్తయింది. ఆ పాపాయి రెండు చేతులకు కట్లు కట్టేసారు.

         మెలుకువ వచ్చాక పాపాయి అమాయకంగా చెప్పింది. “నాన్నా నీ కారు పాడు చేశాను కదా నన్ను క్షమించు” అని అంతే కాదు ఇంకా ప్రశ్నించింది ” నాన్నా చేతి వేళ్ళు మల్లి ఎప్పటికి పెరుగుతాయి” అని, ఈ ప్రశ్నకు జవాబు లేదు తండ్రి దగ్గర. నోట మాట లేని స్తితిలో తనమీద తనకే అసహ్యం వేస్తుంటే కారు దగ్గరకు వెళ్లి ఆ కారు ని ఎడపెడా తన్నడం మొదలు పెట్టాడు. తనేం చేస్తున్నాడో తనకే అర్డంయ్యేసరికి నిస్పృహ ఆవహించింది. కారు ముందు కూలిపోయాడు.

       అప్పుడు కన్నీళ్ళతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసక మసక గా అక్షరాలు కనిపించాయి. కారు మీద కూతురు గీసిన గీతాలు అవే అని అర్ధమయ్యేసరికి, అవి రాసినందుకు తన చిన్నారిని క్రురంగా హింసించి శాశ్వతంగా చేతి వెళ్ళు పోగొట్టానన్న సంగతి మనసుకి తెలిసే సరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది.

     ఇంతకి ఏం రాసిందంటే “డాడి ఐ లవ్ యు” అని. ఆ ఆ తరవాత రోజే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆచరించే ముందు ఆలోచించండి. సహనం కోల్పోవద్దు.