భార్య పోలీస్ భర్త సాఫ్ట్వేర్.. బాత్రూమ్ లో పడి ఉన్న భార్యభర్తల మృతదేహాలు..

34

అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పాకాల మండలంలో చోటు చేసుకుంది. భారతమిట్ట ప్రాంతానికి చెందిన సమియా(30), అల్తాఫ్ హుస్సేన్‌(32) దంపతులకు నాలుగు నెలల కిందట వివాహమైంది.

మండలంలోని కె.వడ్డేపల్లి గ్రామ సచివాలయంలో సమియా మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. అల్తాఫ్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వర్క్‌ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి నుంచే పని చేస్తున్నాడు.

సమియా గురువారం విధులకు హాజరు కాలేదు. గైర్హాజరుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తోటి ఉద్యోగులు మహిళా పోలీసు ఇంటికి వెళ్లి చూడగా.. భార్యభర్తలిద్దరూ బాత్‌రూమ్‌లో విగతజీవులుగా కనిపించారు.

మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.