దారి కాచి ఫ్యామిలీ పై కత్తులు, రాళ్ళతో దాడిచేసి డబ్బు, నగలు దోపిడి

65

దైవ దర్శనం చేసుకొని వస్తున్న ఒక కుటుంబం పై విచక్షణ రహితంగా చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా దొంగలు కత్తులతో దాడి చేశారు. వికారాబాద్ జిల్లాలోని బండవేలికిచర్ల గ్రామానికి చెందిన కె రాములు కుటుంబం పై దొంగల దాడి చేయగా కుటుంబ సభ్యులు అందరూ తీవ్రంగా గాయపడ్డారు.

కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి రాములు ఫ్యామిలీ మీద దాడి జరిగింది. కుటుంబ సమేతంగా కారులో షిర్డీ వెళ్తుండగా రాత్రి రెండు గంటలకు హుమ్నాబాద్ వద్ద ఘటన జరిగినట్టు చెబుతున్నారు. దొంగలు రోడ్డు పై మేకులు వేయడంతో కారు పంక్చర్ అయి బోల్తా పడింది.

బోల్తా పడిన సమయంలో రాములు కుటుంబం పై దాడి చేసి బంగారం, నగదు దోచుకు వెళ్ళారు దొంగలు. ప్రస్తుతం హుమ్నాబాద్ లోని ఓ ఆస్పత్రిలో టీచర్ కుటుంబం చికిత్స పొందుతోంది. టీచర్ కుటుంబంతో పాటు కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కూడా ఉన్నట్టు సమాచారం.