ప్రపంచ వింతల్లో ఈ బంగ్లా కూడా ఒక వింతే.. ఎందుకో తెలుసా..!

46

ప్రపంచంలోనే అతి పలుచని బంగ్లాగా రికార్డుకెక్కిన ఒక బిల్డింగ్ లండన్ లో ఉంది. రెండు పెద్ద బిల్డింగ్ ల మధ్య ఇరుక్కుపోయినట్టుగా ఉన్న ఈ బంగ్లాను 19వ శతాబ్దం చివరిలో నిర్మించారు.

టోపీలు వ్యాపారం చేసే ఓ కుటుంబం తమ వ్యాపారం కోసం ఈ బిల్డింగ్ ను నిర్మించుకున్నారు. ఈ బిల్డింగ్ పొడువు అన్ని బిల్డింగ్స్ లానే సాధారణంగా ఉన్నప్పటికీ వెడల్పు మాత్రం ఆరు నుంచి ఏడు అడుగుల లోపే ఉంటుంది. దీంతో ఈ బిల్డింగ్ ఆహర్షణీయంగా మారింది.

ఇప్పుడు ఈ బిల్డింగ్ ను అమ్మకానికి పెట్టారట. ఈ బిల్డింగ్ ధర రూ.11 కోట్ల రూపాయలు ఉంది. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్, ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్ రూమ్, స్టడీ రూమ్, సెకండ్ ఫ్లోర్ లో బాత్ రూమ్, షవర్ రూమ్, మూడో ఫ్లోర్ లో మాస్టర్ బెడ్ రూమ్ ఉంటాయట.