టీవీ గాని, ఫ్రిజ్‌ గాని, బైక్ గాని ఏది ఉన్నా సరే రేషన్ కార్డు రద్దు

46

ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, బైక్ లాంటివి ఉంటే వారు కార్డు వెంటనే తిరిగి ఇచ్చేయాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. టీవీ, ఫ్రిజ్‌, బైక్ తో పాటు మరి కొన్ని పరిమితులు కూడా విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్‌ కత్తి విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.

5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండకూడదని, రూ. 1.20లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం పొందేవారు రేషన్‌ కార్డులు ఉపయోగించకూడదన్నారు. ఇవి ఉన్న రేషన్‌ లబ్ధిదారులు మార్చి 31లోగా కార్డులను తిరిగిచ్చేయాలని, లేదంటే వారిపై చర్యలు తప్పవన్నారు.

మంత్రి ఉమేశ్‌ వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు రేషన్‌ షాపుల ఎదుట పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీవీ, ఫ్రిజ్‌ లాంటివి ఇప్పుడు నిత్యావసరమయ్యాయని తెలిపారు. అవి ఉన్నంత మాత్రాన రేషన్‌ తొలగించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.