ప్రధానిని విమర్శించొద్దా! అలా రాజ్యాంగంలో ఉందా ?

167

     ప్రధానమంత్రిని విమర్శించినందుకు నోరు విప్పిన బిజెపి నాయకులను వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, మాటలు పరిధులు దాటితే బాగోదని కెసిఆర్ అన్నారు. ప్రధానమంత్రిని విమర్శించకుడదని రాజ్యాంగంలో ఉన్నదా, ఇది దేమోక్రేసి కంట్రీ , అవసరము అనే సమయంలో దేశంలో ఎవరినైనా సరే విమర్శించే హక్కు ప్రతిఒక్కరికి అవకాసమిస్తుంది ప్రజాస్వామ్యం అని కెసిఆర్ మీడియా తో వ్యాక్యానించారు.

     జైలుకు పోవాలని ఉందా అని బిజెపి MLA ఒకరు అన్నారు అని ఇలా మాట్లాడిన వాళ్ళనందరినీ జైలుకి పంపుతారా ఇదేం రాజకీయమని అయన అన్నారు. ఎవరినైనా ఏదైనా చెయ్యగలం అనుకుంటే అది కష్టం, కొన్ని సందర్భాల్లో కొంతమందిని ముట్టుకుంటే భస్మం అవుతారు అని అయన మండిపడ్డారు. నేను జైలుకు పోయేది ఏంటి, ఇక్కడ కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నాను. అందుకు నిదర్సనంగా ఈ ప్రదానమంత్రి గారే పది సార్లు కితాబు ఇచ్చారు నాకు అని కెసిఆర్ మీడియాతో చెప్పారు. అయన ఆస్తులు కూడా ఎం సంపాదించలేదని జేబులో ఉన్న పెన్ను తో సహా ప్రతి సంవత్సరం ఐటి లెక్కలకు సమర్పిస్తూనే ఉన్నామని అయన అన్నారు.