మెరుపు తీగలా మారిన ‘ఖుష్బూ’.. కొత్త లుక్ తో ఎంట్రీ..

స్లిమ్ గా మారిన లుక్ లో ఖుష్బూ ఫొటోను చూసిన నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘గతంలోనే ఖుష్బూ బాగా ఉన్నారు’ అని కొందరు అంటుండగా.. ‘ఇప్పుడే బాగా కనిపిస్తున్నారు’ అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మీ లుక్ ఇలా మారిపోవడానికి కారణమేంటి?’ అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ వ్యాఖ్యల సంగతి అలా ఉంచితే.. రెగ్యులర్ జిమ్ వర్క్ అవుట్స్, డైటింగ్ కారణంగా ఆమె లుక్ మారిందనేది విస్పష్టం. వ్యాయామ, ఆహార నియమాలను తు.చ తప్పకుండా పాటిస్తుండటం వల్లే వయసు పాతికేళ్లు తగ్గినట్టుగా ఖుష్బూ మారిపోయారని అంటున్నారు. 51 ఏళ్ల  వయసున్న ఖుష్బూ ఇంకా 30 ఏళ్ల వయసున్నట్టే కనిపించడం గొప్ప విషయమని సినీరంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఆమె జనరేషన్ కు చెందిన ఎంతోమంది హీరోయిన్లు ప్రస్తుతం 80 కేజీల నుంచి 90 కేజీల బరువుతో ఉన్నారు. వారంతా కూడా ఖుష్బూను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లోనూ ఆమె క్రియాశీలంగా ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. సినిమాలు, రాజకీయాల మధ్య సమతుల్యాన్ని సాధిస్తూ ఖుష్బూ ముందుకు సాగుతుండటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  స్లిమ్ లుక్ లో ఉన్న ఫొటోను ఖుష్బూ ట్విటర్ లో షేర్ చేయగానే పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, షేర్స్ వచ్చాయి.