కరోనా వచ్చి తగ్గిన వారికి ఎముకల క్షయం!..

కోవిడ్‌–19 (సార్స్‌–కోవ్‌–2) వైరస్‌ సోకితే శరీరంలో అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం కొంత అరిగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ పరిశోధనలో తేలింది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు, తర్వాత కోలుకుంటున్న సమయంలో కూడా ఎముకల క్షయాన్ని గుర్తించారు. కరోనా వైరస్‌ సోకిన ఎలుకలపై (సిరియన్‌ హామ్‌స్టర్స్‌) పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ ఫలితాలను నేచరల్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా బారినపడిన ఎలుకల్లోని ఎముకల ధృఢత్వాన్ని త్రీ–డైమెన్షనల్‌ మైక్రో కంప్యూటరైజ్డ్‌ టోమోగ్రఫీ స్కాన్‌ ద్వారా విశ్లేషించారు.

ఆయా ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్‌ కొంత క్షీణించిందని పరిశోధకులు చెప్పారు. ఎముకలు 20 నుంచి 50 శాతం దాకా క్షయానికి గురైనట్లు తెలిపారు.