బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్‌కు ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

56

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొత్తం 106 రోజుల ఎంటర్టైన్మెంట్‌ నిన్నటితో ముగిసింది. డిసెంబర్ 20న ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే థమన్ కన్సర్ట్, హీరోయిన్ల డ్యాన్సులతో వీక్షకులకు కన్నుల పండుగగా తలపించింది. చివర్లో మెగాస్టార్ ఎంట్రీతో ఎపిసోడ్‌ రూపమే మారిపోయింది. సీజన్ 3లో మాదిరిగానే చిరు మరోసారి తనదైన మార్క్ పంచ్‌లతో అందరినీ ఆకట్టుకున్నారు.

బిగ్ బాస్ 4 టైటిల్ పోరులో అభిజీత్ విన్నర్‌ కాగా.. అఖిల్ రన్నరప్‌గా, సోహైల్ రూ. 25 లక్షలతో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అయితే మెగాస్టార్, లక్ష్మీ రాయ్, అనిల్ రావిపూడి, మెహ్రీన్, ప్రణీతలు అతిధులుగా వచ్చిన ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం స్టార్ మా ఎంత ఖర్చు చేసిందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విన్నర్‌కు ఇచ్చే రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో సహా.. భారీ సెట్‌, ఈవెంట్‌కు.. చేసిన డాన్సులకు కలిసి మొత్తం రెండున్నర కోట్లు ఖర్చయిందని టాక్ వినిపిస్తోంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్‌కు కోటిన్నర ఖర్చు చేశారని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్.!