ఒకే ముఖంతో ఉన్న 28 మంది అంటూ సోషల్ మీడియా లో వైరల్

51

ప్రపంచంలో 8 వ వింత, ఒకే ముఖంతో వివిధ దేశాలలో 28 మంది ఉన్నారు అంటూ సోషల్ మీడియా లో ఈ మధ్య ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఫోటో లో వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అంటూ కూడా కొంతమంది షేర్ చేయడం మొదలుపెట్టారు.

అయితే ఆ ఫోటోలో అందరూ ఒకే ముఖంతో ఉండటంతో పాటు ఒకే ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడంతో కొంతమంది అది ఫెక్ న్యూస్ అని ఫోటోషాప్ లో ఎడిట్ చేసిన ఫోటో అని కామెంట్ చేస్తున్నారు. అయితే ‘చెక్ ఫర్ స్పామ్ డాట్ కామ్’ లో అదే ఫోటో లో ఒక ఫేస్ ని క్లియర్ గా చూపించింది. అందులో ఫేస్ మార్ఫింగ్ చేసినట్టు క్లియర్ గా అర్ధమవుతుంది.