
కెనడియన్ ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముఖానికి పక్షవాతం వచ్చింది. రామ్సే హంట్ సిండ్రోమ్ కారణంగా కుడివైపు ముఖంలోని నరాలు చచ్చుబడిపోవడంతో ఆయన పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. బీబర్ మరికొన్నిరోజుల పాటు వరల్డ్ టూర్లో పాల్గొనాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆయన మొదట కాన్సర్ట్ టొరెంటోలో ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో బీబర్ స్పందించారు. తనకు ఆరోగ్యం సరిగాలేకపోవడంతోనే కాన్సర్ట్‌ని రద్దు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.
‘‘చెవి, ముఖంలోని నాడీ వ్యవస్థపై రామ్సే హంట్ సిండ్రోమ్ ఎటాక్ చేయడం వల్ల నా ముఖానికి పక్షవాతం వచ్చింది. మీరు సరిగ్గా చూసినట్లైతే నా కుడికన్ను ఆర్పడానికి వీలు కావట్లేదు. కాన్సర్ట్స్ రద్దు కావడంతో అసహనానికి గురైనవాళ్లకి చెప్పేది ఒక్కటే.. ‘‘ప్రస్తుతానికి ఫిజికల్‌గా ఫిట్‌గా లేను. ఇది కాస్త తీవ్రంగానే పరిగణించాలి. ఇప్పటికైనా కాస్త నిదానించమని నా శరీరం చెబుతున్నట్లు ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొంతకాలం విశ్రాంతి తీసుకుని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని భావిస్తున్నా’’ అని ఆయన తెలిపారు.
View this post on Instagram