చెట్టు మీద పిడుగు పడగానే ఆ చెట్టు క్రింద నలుగురిలో..

263

హర్యానా గుర్గావ్‌లోని సెక్టార్ 82 ప్రాంతంలో సిగ్నేచర్ విల్లాస్ అపార్టమెంట్ కాంప్లెక్స్‌లోని పార్క్ లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వర్షం కురుస్తోందని నలుగురు వ్యక్తులు చెట్టు దగ్గర నించున్నారు. ఇంతలో ఆ చెట్టుపై ఓ పిడుగు పడటంతో ఆ నలుగురు వ్యక్తులూ కుప్పకూలిపోయారు. పిడుగుపాటుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతుంన్నారు, మరో ఇద్దరికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. గుర్గావ్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందని స్థానికుడొకరు తెలిపారు. బాధితులు శివదత్, రామ్ ప్రసాద్, లాలి, అనిల్ నలుగురూ ఆ కాంప్లెక్స్‌లో గార్డెనర్స్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిడుగు పడగానే బాధితుల్లో ముగ్గురు వెంటనే కుప్పకూలగా.. నాలుగో వ్యక్తి కొన్ని సెకన్లు ఆలస్యంగా నేలకు ఒరుగుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.