చావు బ్రతుకుల మధ్య సీనియర్ విలన్.. ఆర్ధిక సాయం కోసం ఎదురు చూపులు..

358

ఒకప్పుడు విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టి అందరినీ ఆకటుక్కున్న నటుడు పొన్నంబళం ఇప్పుడు ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నో తెలుగు తమిళ్ సినిమాల్లో విలన్ గా నటించిన పొన్నంబళం ఆరోగ్యం క్షిణించింది. చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు, ఆర్ధిక సాయం చేసే వారికోసం ఎదురుచూస్తున్నారు.

గత ఐదేళ్లుగా తన అనారోగ్యానికి ఎంతో ఖర్చయ్యిందని తాను సినిమాలకు దూరమవడంతో ఆదాయం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు పొన్నాంబళం. ఇప్పటికే రజినీకాంత్ , కమల్ హాసన్, ధనుష్, లారెన్స్, రాధికా శరత్ కుమార్, కేఎస్ రవికుమార్  సాయం చేసారని తెలిపారు.

ఇక ఇప్పుడు ఆపరేషన్ కు చాలా ఖర్చు అవుతుందని సౌత్ యాక్టర్స్ అసోసియేషన్ తోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సాయం చేయాలని వేడుకున్నారు. ఇప్పుడు కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. తన సోదరి కుమారుడు కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అయితే.. ఆపరేషన్ కు అవసరమైన డబ్బు తన వద్ద లేదని ఆవేదన వ్యక్తం చేశారు.