ముగ్గురు పిల్లల తల్లి పక్కింటి 15 ఏళ్ల కుర్రాడితో పరార్ – పోలీసుల గాలింపు

339

ముగ్గురు పిల్లల తల్లి 7వ తరగతి చదువుతున్న పిల్లాడితో పరారీ అయిన సంఘటన చర్చనియాంశంగా మరింది. పోలీసుల సమాచారం మేరకు ఉత్తరప్రదేశ్‌ గోరఖ్ పూర్ జిల్లాలో కంపియాగంజ్‌కు చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల కుర్రాడితో ఆమె ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ కుర్రాడు తరచూ వివాహిత దగ్గరికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మరింత సన్నిహితం పెరిగింది.

ఇక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సదరు మహిళ కుర్రాడితో ఈనెల 10న పరారైయింది. అది తెలిసి పిల్లాడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యులు పిల్లాడి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎంతకి వారి ఆచూకి తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన సంగతి చెప్పి తమ పిల్లాడి వెతికి పెట్టమని పోలీసులను అతడి కుటుంబ సభ్యులు కోరారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.