స్టోరీ Archives »  

0000-08-14

ఫ్రెండ్స్ ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది. “నేను ఇకపై ఆలయానికి రాను”
తండ్రి ఇలా అడిగాడు: “ఎందుకో నేను తెలుసుకోవచ్చా?”
ఆమె ఇలా అన్నది: ” భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి , వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు” అని చెప్పింది కుమార్తె
తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు, ఆపై ఇలా అన్నాడు: “సరే … నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నాకోసం చిన్న పని చేయగలవా?” అన్నాడు తండ్రి
ఆమె అన్నది: “చెప్పండి .. నాన్నగారు, ఏమిటది?”
తండ్రి ఇలా చెప్పాడు: “దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి వచ్చినా కూడా నీళ్ళు ఏమాత్రం క్రింద పడకుండా రావాలి.” రాగలవా? అన్నాడు తండ్రి
కుమార్తె చెప్పింది: “ఓ … తప్పకుండా నేను చేయగలను.”
అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది:
“చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను”
అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు:
1. ఈసారి వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్ తో ఉండగా నీవు చూశావా?
2. ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూశావా?
3. ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా?
ఆమె ఇలా చెప్పింది: “నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించలేదు “
అతను ఆమెతో చెప్పాడు: “నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినదిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయనగురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు, పైగా నీవంటి వారిని చూసి వారుకూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధనా మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నతపథంలో నడిపిస్తాయి”
దేవాలయంలో గడప వలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఏకాగ్రత, సాధన ముఖ్యం..
సేకరణ

0000-08-13

ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు.

ఆ ఇoటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నము వడ్డిస్తూ వుంది. ఆమె చాల అందగత్తె, ఆవిడ అందము చూసి రాజుగార్కి ఆశ్చర్యము కలిగింది, ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇoత అందమైన స్త్రీని ఇదివరకు చూడలేదే అని అనుకున్నాడు.
ఆమె భర్త భోజనo చేసి తన పనికై బయటికి వెళ్ళాడు.
భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది.
అప్పుడా రాజు ఇoటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజవంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. ఎవరు మీరు అని ప్రశ్నించింది.
రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా వున్నావు, నీ అందం నన్ను కట్టిపడవేస్తోంది. నిన్ను నా భార్యగ చేసుకోవాలి అనుకుంటున్నాను, నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను, నీవు చూడని సంపద చూడగలవు, అడుగులకు మడుగులోత్తే పనివారు, కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యతనాది అన్నాడు.
ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారము కలది. ఆవిడ రాజుగారితో ఇలా అన్నది. రాజా! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను, ముందు మీరు అలసిపోయి వుంటారు. శరీరం,మనసు రెండు ఆకలితో వుంటాయి. మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పింది.
ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతందని, ఆవిడ అంగీకరిస్తుందనీ ఊహించలేదు. ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలనుకున్నాడు. కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు. కాళ్ళుచేతులు కడుగుకొని ఇంటిలోనికి వెళ్ళాడు.
రాజా! మీరు భోంచేయండి! అంటూ వాళ్ళ ఆయన తినిన అరిటిఆకును రాజు ముందు వేసి ఇలా అన్నది, ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు, అదే ఎంగిలి ఆకులో మీరూ భోజనము చేయండి. మీ ఆకలి తీరాక నేను మీతో వస్తాను మీరాజ్యానికి అన్నది.
రాజుకు ఊహించని ఆ పరిణామానికి ఆమెపై కోపము, ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యము కలిగాయి. దేశాన్నేలే ప్రభువును నేను, ఎప్పుడూ బంగారు పళ్ళెంలో ఘుమఘుమలాడే షడ్రసోపేతమయిన వంటకాలు వేడివేడిగా తినే నాకు ఈ ఎంగిలి ఆకులో భోజనము వడ్డించడానికి నీకెంత ధైర్యము అని గద్దించాడు.
అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది.
మహరాజా! నా భర్త భోజనము చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా? పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి, భోంచేసే విస్తరాకు విషయంలో కలిగిందా? ఎంత ఆశ్చర్యము అన్నది.
రాజుకు ఆమె మాటలలోని అంతరార్ధం అర్ధమయ్యింది. కనువిప్పు కలిగింది.మోహం పటా పంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి , సమయస్పూర్తికి ముగ్ధుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి తల్లీ! నన్ను క్షమించు! కేవలం బాహ్యసౌందర్యాన్ని చూసి ఇంద్రియనిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సుక్ష్మాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీవంటి మాతృమూర్తులవల్లే ధర్మం ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
పరాయి స్త్రీ పై వ్యామోహం ఎంగిలిఆకులో భోజనము ఒక్కటే.
*స్త్రీలలో ఆడతనాన్ని గాక అమ్మతనాన్ని దర్శించిన వారు కృతార్దువులవుతారు*.
సేకరణ

0000-08-06

ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేసాడు… అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని… అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని*.
*పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు…. రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది…*
*బెల్ మోగింది, తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది…*
*వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది… తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ…*
*తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.*
*ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు…*
*అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కింద పడేసాడు.* *అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే…. జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే… అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.*
*ఇక వెళ్ళొస్తామంటూ… బయల్దేరారు ముగ్గురూను.*
*తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని “అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి” అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు. భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా… కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.* 👍
*”ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా… నీ చేతి వంట రుచి చూడాల్సిందే” అన్నాడు* *భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ…*
*ఆలోచించుకుంటూ….!*
*సోదరులంటే ఇలా ఉండాలి కదా….!*
*బంధం అనే కాదు… కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.*
*ఆత్మీయతను కోల్పోకండి.!*
*దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు.*
*ఏదైనా విభేదాలు ఉన్నా… మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.*
*”ఏమంటారు”*..?
*ఇలాంటి ఆత్మీయతలను;* *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం*, కానీ ఈ మెసేజ్ ని సాధ్యమైనంత ఎక్కువ గ్రూవులలో షేర్ చేసి మళ్ళి ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది…
error: